Saturday, April 20, 2024

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

COVID

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 5,609 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 132 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,12,359 చేరింది. ఇందులో ప్రస్తుతం 63,624 యాక్టివ్ కేసులుండగా.. 3,435 కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 45,299 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 39,297చేరగా… 1,390 మంది ప్రాణాలు విడిచారు. తమిళనాడులో కోవిడ్ కేసులు సంఖ్య 13,191కి పెరిగింది. 87మంది చనిపోయారు. గుజరాత్ లో కరోనా కేసులు 12,537చేరాయి. ఇప్పటివరకు 749మందిని కరోనా కబలించింది. ఢిల్లీలో 11,088 కేసులు నమోదు కాగా.. 176మంది బాధిుతులు కరోనాతో మృత్యువాత పడ్డారు.

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,661మందికి కరోనా సోకగా… 40మంది మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు దాటింది. యుఎస్ లో మరణాలు లక్షకు చేరువలో ఉన్నాయి. అన్ని దేశాల్లో కలిపి కరోనా బాధితుల సంఖ్య అరకోటి దాటింది. ఇటలీ, స్పెయిన్ లో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది. రష్యా, బ్రెజిల్ ను కరోనా భూతం వణికిస్తోంది.

5609 New Covid 19 cases and 132 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News