Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 5,611 కరోనా కేసులు.. 140మరణాలు

- Advertisement -
- Advertisement -

Corona

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 5,611 కోవిడ్-19 కేసులు, 140 మరణాలు నమోదయ్యయయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,06,750చేరింది. ఇందులో 61,149 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ మహమ్మారితో 3,303మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా… 42,297మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అటు మహారాష్ట్రలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 37,136 చేరాయి. ఇప్పటివరకు 1,325మంది చనిపోయారు. తమిళనాడులో 12,448 కేసులుండగా… 84మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసులు 12,140 చేరగా… 719 మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య 10,554కు పెరిగింది. ఇప్పటివరకు 168 కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే ఇన్ని కేసులు పెరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

5611 New Covid 19 Cases And 140 Deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News