Thursday, April 25, 2024

6.4 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు విదేశాలకు ఎగుమతి

- Advertisement -
- Advertisement -
6.4 crore Covid vaccine doses to foreign countries
లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 12 నుంచి జులై 22వ తేదీ మధ్య దాదాపు 6.4 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులను భారత్ విదేశాలకు పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కు తెలియచేసింది. జనవరి 12 నుంచి జులై 22వ తేదీ మధ్య సుమారు 42.2 కోట్ల వ్యాక్సిన్ డోసులను రవాణా చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్ ఒక లిఖితపూర్వక సమాధానంలో లోక్‌సభకు తెలియచేశారు. వీటిలో సుమారు 35.8 డోసులను దేశీయ విమానాశ్రయాల ద్వారా రవాణా చేయగా 6.4 కోట్ల డోసులను అంతర్జాతీయ గమ్యస్థానాలకు పంపించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 45 కోట్ల డోసులకు పైగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇందులో 18-44 మధ్య వయసున్న వారికి 15.38 కోట్ల డోసులు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం పార్లమెంట్‌లో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News