Home తాజా వార్తలు రూ. 92,130 కోట్లు పెరిగింది..

రూ. 92,130 కోట్లు పెరిగింది..

Six of top-10 firms add Rs 92,130.59 cr

 

టాప్ 10లో ఆరు కంపెనీలు లాభపడ్డాయ్

ముంబై: గతవారం స్టాక్‌మార్కెట్లలో లాభాలు టాప్ 10 కంపెనీల్లో ఆరు సంస్థలకు మంచి లాభాలను ఇచ్చాయి. 6 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ .92,130.59 కోట్లు పెరిగింది. గత వారాంతం శుక్రవారం సెన్సెక్స్ 439.54 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) గత వారం మంచి లాభాలతో బిఎస్‌ఇలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.25,722.6 కోట్లు పెరిగి మొత్తం విలువ రూ.7,93,854 కోట్లకు చేరింది. గత వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ క్యాప్ తగ్గింది. ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ.10,713 కోట్లు తగ్గి మొత్తం రూ.11,04,704 కోట్లకు చేరుకుంది.

అయినప్పటికీ మార్కెట్ క్యాప్ పరంగా ఆర్‌ఐఎల్ ఇప్పటికీ బిఎస్‌ఇలో అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ .18,104.7 కోట్లు పెరిగి రూ.3,18,648.65 కోట్లకు చేరగా, హిందుస్తాన్ యూనిలీవర్ విలువ రూ.14,614.2 కోట్లు పెరిగి రూ .5,06,198.81 కోట్లు అయింది. ఐటిసి మార్కెట్ వాల్యుయేషన్ రూ .13,521.45 కోట్లు పెరిగి రూ .2,39,821.43 కోట్లకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ .12,460.2 కోట్లు పెరిగి రూ .5,79,553.80 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ .7,707.44 కోట్లు పెరిగి రూ .2,65,347.77 కోట్లకు చేరుకుంది. ఇక మార్కెట్ విలువ తగ్గిన సంస్థల విషయానికొస్తే.. హెచ్‌డిఎఫ్‌సి ఎంక్యాప్ రూ.11,996 కోట్లు తగ్గి 3,06,600.66 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ తగ్గింది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.9,645 కోట్లు క్షీణించి రూ.2,26,002 కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ .6,082.95 కోట్లు తగ్గి రూ .3,05,674.88 కోట్లకు చేరింది. టాప్ 10 ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో రిలయన్స్ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.

Six of top-10 firms add Rs 92,130.59 cr