Home తాజా వార్తలు రూ.1.38 లక్షల కోట్లు ఆవిరి

రూ.1.38 లక్షల కోట్లు ఆవిరి

6 of 10 most valued companies lose Rs 1.38 lakh cr

 

గత వారం టాప్10లో ఆరు కంపెనీలకు నష్టం

న్యూఢిల్లీ : గతవారం సెన్సెక్స్ టాప్10 కంపెనీలలో ఆరు సంస్థ మార్కె ట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.1.38 లక్షల కోట్లు క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అత్యధిక నష్టాలను చవిచూశాయి. గత వారం 30 షేర్ల సెన్సెక్స్ 522.01 పాయింట్లు లేదా 1.36 శాతం కోల్పోయింది. వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,239 కోట్లు తగ్గి రూ.13,10,323 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ.46,374 కోట్లు తగ్గి రూ.5,67,877 కోట్లకు తగ్గింది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.22,631 కోట్లు తగ్గి రూ.2,24,659 కోట్లకు చేరగా, హెచ్‌డిఎఫ్‌సి విలువ రూ.10,078 కోట్లు తగ్గి 3,09,254 కోట్ల కు చేరుకుంది.

ఐటిసి మార్కెట్ వాల్యుయేషన్ రూ.6,815 కోట్లు తగ్గి రూ.2,38,660 కోట్లకు, భారతి ఎయిర్‌టెల్ .2,700.5 కోట్లు తగ్గి 3,02,701.60 కోట్లకు చేరుకుంది. అయితే వీటికి విరుద్ధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంలో రూ.47,054 కోట్లు పెరిగి రూ.8,56,463 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.18,591.83 కోట్లు పెరిగి రూ.4,11,554 కోట్ల వద్ద ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ రూ.3,481 కోట్లు పెరిగి రూ.2,70,600 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.740 కోట్లు పెరిగి రూ.5,19,931 కోట్లకు చేరుకుంది. టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది.

6 of 10 most valued companies lose Rs 1.38 lakh cr