Wednesday, April 24, 2024

గొప్ప సైన్యం ఉన్న పార్టీ టిఆర్‌ఎస్: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

60 Lakh membership in TRS Party

 

హైదరాబాద్: 60 లక్షలు సభ్యత్వాలు కలిగిన పార్టీ టిఆర్‌ఎస్ అని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడారు. అద్భుతమైన ప్రజాపునాది కలిగి ఉన్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ అన్నారు. ఎన్ని అడ్డంకులున్న ఛేదించుకొని ముందుకు పోతున్నామని, అద్భుతమైన భవిష్యత్ ఉన్న పార్టీ టిఆర్‌ఎస్ అని, ఏ ఒక్క వ్యక్తి వల్లనో ఇదంతా సాధ్యం కాలేదన్నారు. అభివృద్ధిలో అందరం పాలుపంచుకుందామని పిలుపునిచ్చారు. చట్టబద్ధంగా పార్టీకి వచ్చిన విరాళాలు రూ.425 కోట్లు అని, విరాళాల నుంచి నెలకు రెండు కోట్ల ఆదాయం వస్తుందని కెసిఆర్ ప్రకటించారు. అతి త్వరలో జిల్లా పార్టీ కార్యాలయాలు పూర్తవుతాయని, ఇటీవలే ఢిల్లీలో కూడా టిఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన జరిగిందన్నారు. ఆర్థిక పరంగా శక్తిని సంతరించుకున్న పార్టీ టిఆర్‌ఎస్ అని తెలియజేశారు. గొప్ప సైన్యం ఉన్న పార్టీ టిఆర్‌ఎస్ అని అన్నారు. అవగాహనారాహిత్యంతో అడ్డం పొడుగు మాట్లాడితే బెదరమని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News