Friday, March 29, 2024

22 ఏళ్ల కుర్రాడితో 60 ఏళ్ల బామ్మ ప్రేమాయణం… పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో వార్

- Advertisement -
- Advertisement -

 

లక్నో: 22 ఏళ్ల కుర్రాడితో 60 ఏళ్ల బామ్మ ప్రేమలో పడిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో అగ్రా ప్రాంతంలో జరిగింది. యువకుడిపై బామ్మ భర్త, కుమారులు ఎత్మాదదౌలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 60 ఏళ్ల బామ్మకు ఏడుగురు పిల్లలు, ఆమెకు మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆ బామ్మ 22 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడడమే కాకుండా పెళ్లి చేసుకుంటామని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ బామ్మ కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలను పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తమను ఎవరు విడదీయలేరని, బంధాన్ని కొనసాగిస్తామని కరాఖండిగా పోలీస్ స్టేషన్‌లో తెలిపారు. దీంతో బామ్మ కుటుంబ సభ్యులు యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.

60-year-old Women love with 22-year-old man in Agra
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News