Wednesday, April 24, 2024

వారికి బూస్టర్ కోసం మెడికల్ సర్టిఫికెట్ అక్కరలేదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇతర వ్యాధులతో బాధపడుతూ ప్రికాషనరీ (బూస్టర్) డోసు తీసుకోవాలనుకునే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. తమ పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు మెడికల్ సర్టిఫికెట్ లేకుండానే రిజిస్టర్ చేయించుకోవచ్చని, బూస్టర్ డోసు తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మంగళవారం జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అరవై ఏళ్లు పైబడిన వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని అనుకుంటే డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని సమావేశం నిర్ణయించింది. అయితే వ్యాక్సిన్ తీసుకునే ముందు వారు తమ సొంత వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలని స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ లేఖలు రాశారు.

60 years old not required medical Certificate for Booster dose

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News