Home జాతీయ వార్తలు 24 గంటల్లో రికార్డుస్థాయి కేసులు… 6088

24 గంటల్లో రికార్డుస్థాయి కేసులు… 6088

6,088 India Coronavirus Cases In 24 Hours

 

మరణాలు 148, ఒక్క మహారాష్ట్రలోనే 64

న్యూఢిల్లీ: కోవిడ్19 కేసులు ఒక్క రోజే 6088 నమోదయ్యాయి. కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇదే అత్యధికం. గురువారం ఉదయం 8 నుంచి 24 గంటల్లో కొత్తగా 6088కేసులు నమోదు కాగా,148మంది మృతి చెందారు. దీంతో, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,18,447కు చేరుకోగా, మరణాలు3583కి చేరాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 66,330 కాగా, స్వస్థత పొంది ఇళ్లకు వెళ్లినవారు 48,533మంది. రికవరీ రేట్ 40.97 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

148 మరణాల్లో మహారాష్ట్రలో 64, గుజరాత్‌లో 24, ఢిల్లీలో 18, ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, తమిళనాడులో 7, బెంగాల్‌లో6, తెలంగాణలో 5, రాజస్థాన్‌లో4 మధ్యప్రదేశ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌లో 2, బీహార్, ఒడిషా, హర్యానా, పంజాబ్‌ల్లో ఒక్కొకటి చొప్పున నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య మహారాష్ట్రలో 1454, గుజరాత్‌లో 773, మధ్యప్రదేశ్‌లో 270, బెంగాల్‌లో 259, ఢిల్లీలో 194, రాజస్థాన్‌లో 151, ఉత్తర్‌ప్రదేశ్‌లో 138, తమిళనాడులో 94, ఆంధ్రప్రదేశ్‌లో 53, తెలంగాణలో 45కు చేరింది.

మొత్తం కేసుల సంఖ్య మహారాష్ట్రలో 41,642, తమిళనాడులో 13,967, గుజరాత్‌లో 12,905, ఢిల్లీలో 11,659, రాజస్థాన్‌లో 6,227, మధ్యప్రదేశ్‌లో 5,981, ఉత్తర్‌ప్రదేశ్‌లో 5,515, బెంగాల్‌లో 3197,ఆంధ్రప్రదేశ్‌లో 2647, పంజాబ్‌లో 2028, బీహార్‌లో 1982, తెలంగాణలో 1699,కర్నాటకలో 1605, జమ్మూకాశ్మీర్‌లో 1449, హర్యానాలో 1031, కేరళలో 690, జార్ఖండ్‌లో 290, చండీగఢ్‌లో 217, అస్సాంలో 203, త్రిపురలో 173, హిమాచల్‌ప్రదేశ్‌లో 152, ఉత్తరాఖండ్‌లో 146, ఛత్తీస్‌గఢ్‌లో 128, గోవాలో 52కు చేరుకున్నాయి. మరో 1620 కేసుల్ని ఏ రాష్ట్రానివన్నది ఐసిఎంఆర్ నిర్ధారిస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది.

6,088 India Coronavirus Cases In 24 Hours