Home కరీంనగర్ 61 మంది మందుబాబులకు జైలుశిక్ష

61 మంది మందుబాబులకు జైలుశిక్ష

కరీంనగర్: మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో 61 మంది మందుబాబులకు జైలుశిక్ష విధించడమే కాకుండా రూ.లక్షా 11వేలను జరిమానా వేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్‌కు చెందిన పెరంబూర్ వెంకటస్వామి, బుడ్డి చైర్‌మెన్‌లకు 15 రోజులు, కొరపల్లికి చెందిన లొకిని సుధాకర్‌కు 14 రోజులు, టేకుర్తికి చెందిన కోడం శ్రీకాంత్‌కు ఏడు రోజులు, ఇందారంకు చెందిన మినుగు భానుచందర్, కరీంనగర్‌కు చెందిన గజ్జెల ప్రభాకర్, రాగంపేటకు చెందిన సింగసాని కనుకయ్యలకు నాలుగు రోజులు, బీహార్‌కు చెందిన రాంసాగర్ మాజీ, మెదక్‌కు చెందిన దూదేకుల సలీం, టేకుర్తికి చెందిన కొంచెం రాజ్‌కుమార్‌లకు మూడురోజులు, కరీంనగర్‌కు చెందిన ఎస్.చంద్రశేఖర్, ఎస్.రామచంద్రంలకు ఒకరోజు ఒకరోజు జైలుశిక్ష, జరిమానా విధించారు. మరో 45 మందికి జరిమానా విధించారు. 61 మంది మందుబాబులకు రూ.లక్షా 11వేల రుపాయలను జరిమానాగా కోర్టు విధించినట్లు సి.పి వి.బి.కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు.

61 sentenced for drunk driving in Karimnagar