Thursday, April 25, 2024

రాష్ట్రానికి ‘వరి సిరి’

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే రికార్డు స్థాయిలో 62లక్షల ఎకరాల్లో నాట్లు

పలు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న వరినాట్లు సీజన్ ముగిసేసరికి
65లక్షలకు చేరే అవకాశం సిఎం కెసిఆర్ దూరదృష్టితో పెరిగిన జల వనరులు
పుష్కలంగా వర్షాలు.. మత్తడి దూకిన చెరువులు నిరంతర ఉచిత విద్యుత్‌తో
వరి సాగుకే జై కొట్టిన రైతన్న ‘పత్తి’ని మించిన విస్తీర్ణం
వానాకాలం 1.32 కోట్ల ఎకరాల్లో పంటల సాగు

మన తెలంగాణ/ హైదరాబాద్: వాతావరణం అనుకూలించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో వరిసాగు రికార్డు సృష్టించింది. తొలిసారి వరిసాగు విస్తీర్ణం ఆదరహో అనిపించిం ది. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో సాగునీటి రంగాని కి ఇచ్చిన ప్రాధాన్యం .. మిషన్ కాకతీయ ద్వారా చేప ట్టిన పనులు మంచి ఫలితాలను ఇచ్చాయి. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిశాయి..చెరువులు కుంటలు వరదనీటితో నిండి మత్తడులు దుంకాయి..కృష్ణా, గోదా వరి నదులపై ఉన్న మధ్యతరహా, చిన్న తరహా ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోయాయి. భూగర్బ జల మట్టాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రమంత టా సాగునీటి వనరులు సమృద్ధిగా అందుబాటలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని వానాకాలం పంటల సాగుకు రైతుబంధు పథకం ద్వారా రైతుచేతికి సకాలంలో పెట్టుబడి సాయం అందజేయించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో సహకరిచటం లేదని ,వరిసాగు ద్వారా రైతులు మార్కెట్ సమస్యల్లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని, వరి సాగు తగ్గించాలని సూచిస్తూ వ్యవసాయశాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించింది.

మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని జిల్లాల సదస్సుల్లో పాల్గొని పంటల సాగు పట్ల అవగాహన పెంచేప్రయత్నాలు చేశారు. కేంద్రం పెట్టు ఇబ్బందులు , మార్కెటింగ్ సమస్యలు దృష్టిపెట్టుకొని ప్రభుత్వం వరిసాగు వద్దు ..వద్దన్నా..రైతులు వరిసాగుకే జై కొట్టారు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరిసాగు పట్ల మొగ్గు చూపారు. వర్షాధార పంటలు సాగు చేసే ప్రాంతాల్లో కూడా నీటివనరులు అందుబాటులోకి రావటంతో పొలాలను వరిసాగుకు అనువుగా మార్చుకున్నారు. దీంతో రాష్ట్రలో వరి నాట్లు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రతియేటా వానాకాలం పంటల సాగు ప్రణాళికలో పత్తి సాగు విస్తిర్ణానిదే పైచేయిగా ఉంటూ వచ్చేది.. ఈ సారి పత్తిసాగును సైతం పక్కకుతోసి వరిసాగు విస్తీర్ణం అగ్రభాగాన నిలిచింది. వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకూ అన్ని రకాల పంటలు కలిపి 1.32కోట్ల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ ఎంపిక చేసుకున్న ప్రాధామిక పంటల సాగు విస్తీర్ణపు లక్ష్యాల్లో 108శాతం పంటల సాగు జరిగింది. అందులో ఈ వానాకాలం వరిసాగు విస్తీర్ణతను 42.04లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకోగా , సాగు విస్తీర్ణం దూసుకుపోతోంది.

ఇప్పటికే 62.12లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి.. ఇంకా పలు జిల్లాల్లో వరినాట్ల పనులు కొనసాగుతూనే వున్నాయి. ఈ నెల మూడో వారం నాటికి మరో ఏడెనిమిది లక్షల ఎకరాల్లో వరినాట్లు పడే అవకాశం ఉందని అంచాన వేస్తున్నారు. సీజన్ ముగిసే సరికి వరిసాగు విస్తీర్ణం 70లక్షల ఎకరాలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో పత్తిపంట 49.58లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. తొలిసారి పత్తిసాగును మించి వరిసాగు జరిగింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి వరిసాగు విస్తీర్ణం దూసుకుపోతోంది. 2020వానాకాలం సిజన్‌లో 1.35కోట్ల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం జరగ్గా , అందులో వరిసాగు 53.33లక్షల ఎకరాల్లో జరిగింది. పత్తిసాగు 60.53లక్షల ఎకరాల్లో జరిగింది. 2021వానాకాలంలో 1.29కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేశారు. అందులో సీజన్ ముగిసే సరికి 61.94లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. పత్తిసాగు విస్తీర్ణం 46.42లక్షల ఎకరాలకు పరిమితం అయింది. 2022 వానాకాలం సిజన్‌లో వరిసాగు మంచి ఊపుమీద సాగుతోంది.

108శాతం చేరిన పంటల విస్తీర్ణం:

రాష్ట్రంలో ఈ వానాకాల పంటల సాగుకు సంబంధించి ఇప్పటివరకూ సాగువిస్తీర్ణం 108శాతానికి చేరుకుంది. అన్ని రకాల పంటలు కలిపి 1.23కోట్ల ఎకరాల్లో సాగుచేయించాలని వ్యవసాయశాఖ లక్షంగా పెట్టుకుంది. వాతావరణం అనుకూలించటంతో వ్యవసాయశాఖ ప్రాధమిక లక్ష్యాలను దాటేసింది. ఇప్పటి వరకూ 1,32,84,952ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. గత వానాకాల సీజన్‌లో ఈ సమయానికి 1,21,59,615 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పంటల సాగుకు పూర్తిగా అనుకూలించాయి. వరిసాగు 42.04లక్షల ఎకరాల్లో సాగు లక్షం కాగా 62.12లక్షల ఎకరాల్లో వరినాట్లతో వరిసాగు విస్తీర్ణం 148శాతం లక్ష్యాలు చేరుకుంది. గత ఏడాది ఈ సమయానికి 62.12లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఈ వానాకాలం కంది , పెసర , మినుము తదితర పప్పుధాన్య పంటలు 10.36లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందించగా 63శాతం విస్తీర్ణంతో 6,54,034ఎకరాల్లో పప్పుధాన్య పంటలు సాగులోకి వచ్చాయి.

అందులో ప్రధానంగా కంది 5.57లక్షల ఎకరాలు, పెసర 66వేల ఎకరాలు, మినుము 29వేల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. నూనెగింజ పంటల సాగు కూడా 89శాతం జరిగింది. వేరుశనగ, పొద్దుతిరుగు, ఆముదం, కుసుమ, నూగు , సోయాబీన్ తదితర నూనెగింజ పంటలు మొత్తం 449750ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా సోయాబీన్ పంట 4.29లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. గత ఏడాది వానాకాలం నూనెగింజ పంటలు 374634ఎకరాల్లో సాగు చేశారు. ప్రధాన వాణిజ్య పంటలసాగుకు సంబంధించి పత్తి 99శాతం విస్తీర్ణంతో 49,58,462ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది 50.77లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరిగింది. చెరకు సాగు 74841ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 36174ఎకరాల్లోనే చెరుకు సాగు చేశారు. ఇతర ఆహారేతర పంటలు 3.15లక్షల ఎకరాల్లో సాగు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News