Tuesday, April 23, 2024

24 గంటల్లో వెయ్యిదాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

62,064 కొత్త కేసులు, 44 వేలకు పైగా మొత్తం మరణాలు
22 లక్షలు దాటిన కేసులు
రికవరీ రేటు 70 శాతానికి చేరిక
రికార్డు స్థాయిలో ఒక్క రోజే 54,859మంది బాధితుల రికవరీ

62064 New Corona Cases Registered in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సాగిస్తోంది. ఫలితంగా మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడచిన కొన్ని రోజులుగా నిత్యం 900కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా బారిన పడి 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఒక్క రోజే వెయ్యి మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో ఇప్పటివనకు ఈ వైరసః బారిన పడి 44,386 మంది ప్రాణాలు కోలోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తున్న దేశాల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూ ఉంది.

గత నాలుగు రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 62,064 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 22 లక్షలను దాటింది. మొత్త కేసుల సంఖ్య 22,15,074కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 15,35,743 మంది కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 54,859 కోలుకోగా, మరో 6,34,945 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో దేశంలో రికవరీల రేటు 70 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 2 శాతానికి తగ్గినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పెద్ద ఎత్తున కరోనా రోగులను గుర్తించి పరీక్షలు నిర్వహించడంతో పాటుగా సకాలంలో ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించడం కారణంగానే రికవరీలు పెరగడం, మరణాల రేటు తగ్గడం సాధ్యమైందని ఆ శాఖ తెలిపింది. కాగా ఆదివారం ఒక్క రోజే 4,77,023 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగిందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది.

దీంతో, ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,45,83,558కి చేరుకుందని ఆ సంస్థ తెలిపింది. కాగా సోమవారం సంభవించిన మరణాల్లో మహారాష్ట్రలో 390, తమిళనాడులో 119, కర్నాటకలో 107, ఆంధ్రప్రదేశ్‌లో 97 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో 54 మంది, యుపిలో 41 మంది, గుజరాత్, పంజాబ్‌లలో24 మంది చొప్పున చనిపోయారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 17,757 మంది చనిపోగా, తమిళనాడులో 4,927మంది, ఢిల్లీలో 4,111 మంది, కర్నాటకలో 3,198 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్, యుపి, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా 2000కు పైగానే ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉండగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలి స్థానంలో ఉండగా, బ్రెజిల్, భారత్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే లక్షా 62 మంది ప్రాణాలు కోల్పోగా, బ్రెజిల్‌లో లక్ష మంది చనిపోయారు.
యెడియూరప్ప డిశ్చార్జి
కాగా ఈ నెల 2వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మణిపాల్ ఆస్పత్రిలో చేరిన కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప కోలుకుని సోమవారం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు.

62064 New Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News