Wednesday, April 24, 2024

కశ్మీర్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

64 leaders resigned from the party in support of Azad

ఆజాద్‌కు మద్దతుగా 64 మంది నేతలు పార్టీకి రాజీనామా
రాజీనామా చేసిన వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి తారాచంద్ తదితరులు

శ్రీనగర్: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాతో తగిలిన దెబ్బనుంచి ఇంకా కోలకోక ముందే జమ్మూ,కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా రాష్ట్ర మాజీ ఉనముఖ్యమంత్రి తారాచంద్ సహా 64 మంది నేతలు మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా కలిసికట్టుగా ఒకే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. తారాచంద్‌తో పాటుగా మాజీ మంత్రులు అబ్దుల్ మజీద్ వని, మనోహర్‌లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎంఎల్‌ఎ బల్వాన్ సింగ్ తదితరులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి తామంతా రాజీనామా చేసినట్లు వారు ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు.‘

ఆజాద్‌కు మద్దతుగా మేమంతా ఉమ్మడి రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించాం’ అని బల్వాన్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్ల అనుబంధాన్ని గులాం నబీ ఆజాద్ శుక్రవారం తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. సంప్రదింపుల యత్రాంగాన్ని రాహుల్ గాంధీ సమూలంగా నాశనం చేశారని, ఏళ్ల తరబడి తమ సూచనలు, సలహాలను ఎఐసిసి తుంగలో తొక్కిందని, వందిమాగధుల మాటలు విటూ, సీనియర్లను పట్టించుకోకుండా చిన్నబుచ్చుతోందని ఆయన ఆరోపించారు. జమ్మూ, కశ్మీర్‌నుంచి జాతీయ స్థాయి పార్టీని సొంతంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటన తర్వాత కాంగ్రెస్‌కు చెందిన డజనుకు పైగా మాజీ మంత్రులు , ఎంఎల్‌ఎలు, వందలాది మంది పంచాయతీ రాజ్ సభ్యులు , మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా, బ్లాక్‌స్థాయి నేతలు ఆజాద్‌తో చేతులు కలిపేందుకు పార్ట్టీని వీడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News