Home తాజా వార్తలు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ టాలీవుడ్ విజేతలు

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ టాలీవుడ్ విజేతలు

Film-Fare-Awards

దక్షిణ భారత సినీ పరిశ్రమలన్నింటికీ కలిపి ఏటా నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సౌత్ కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్‌లకు చెందిన పలువురు నటీనటులు అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగులో ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులు, ఉత్తమ నటుడిగా నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను ఎన్‌టిఆర్, ఉత్తమ నటిగా అ ఆ చిత్రానికి గాను సమంత అవార్డులు దక్కించుకున్నారు. తెలుగులో వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్న విజేతల వివరాలు ఇలా ఉన్నాయి…
ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
ఉత్తమ నటుడు: ఎన్‌టిఆర్(నాన్నకు ప్రేమతో)
ఉత్తమ నటి: సమంత(అ ఆ)
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి(ఊపిరి)
ఉత్తమ నటుడు(క్రిటిక్ అవార్డు): అల్లు అర్జున్(సరైనోడు)
ఉత్తమ నటి(క్రిటిక్ అవార్డు): రీతూ వర్మ(పెళ్లిచూపులు)
ఉత్తమ సహాయ నటుడు: జగపతి బాబు(నాన్నకు ప్రేమతో)
ఉత్తమ సహాయ నటి: నందితా శ్వేతా(ఎక్కడికి పోతావు చిన్నవాడా)
ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(ప్రణామం పాట-జనతా గ్యారేజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీప్రసాద్(నాన్నకు ప్రేమతో)
ఉత్తమ గాయకుడు: కార్తీక్(అ ఆ మూవీలోని ఎల్లిపోకే శ్యామల పాటకు)
ఉత్తమ నేపథ్య గాయని: చిత్ర(నేను శైలజ చిత్రంలోని ఈ ప్రేమకి పాటకు)
జీవితకాల సాఫల్య పురస్కారం: డాక్టర్ విజయ నిర్మల