Home తాజా వార్తలు 64వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్… ‘రాజీ’కి అవార్డుల పంట

64వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్… ‘రాజీ’కి అవార్డుల పంట

64th Filmfare Awards 2019ముంబయి: 64వ విమల్ ఇళైచి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక శుక్రవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ తారలోకమంత ఈ వేడుకకు తరలివచ్చింది. 2018 ఏడాదికిగాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటినటులకు ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేశారు. యువనటి అలియా భట్ నటించిన ‘రాజీ’ మూవీకి అవార్డుల పంట పడింది. ఈ చిత్రం ఏకంగా  వివిధ విభాగాల్లో ఐదు అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌(సంజు), ఉత్తమ నటిగా అలియా భట్(రాజీ) అవార్డులు అందుకోగా, ఉత్తమ నటిగా(పరిచయం) సారా అలీఖాన్‌(కేదార్‌నాథ్‌), ఉత్తమ నటుడు (పరిచయం) ఇషాన్‌ ఖత్తర్‌ (బియాండ్‌ ది క్లౌడ్స్‌) ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్న వారి జాబితాను ఓసారి చూద్దాం…

ఉత్తమ చిత్రం: రాజీ
ఉత్తమ చిత్రం (క్రిటిక్‌): అంధాధున్‌
ఉత్తమ నటి: అలియా భట్‌ (రాజీ).
ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (సంజు).
ఉత్తమ నటి (క్రిటిక్‌): నీనా గుప్తా (బదాయీ హో).
ఉత్తమ నటుడు (క్రిటిక్‌): రణ్‌వీర్‌ సింగ్‌ (పద్మావత్‌).
ఉత్తమ నటి (పరిచయం): సారా అలీ ఖాన్‌ (కేదార్‌నాథ్‌)
ఉత్తమ నటుడు (పరిచయం): ఇషాన్‌ ఖత్తర్‌ (బియాండ్‌ ది క్లౌడ్స్‌).
ఉత్తమ దర్శకురాలు: మేఘనా గుల్జార్‌ (రాజీ).
ఉత్తమ దర్శకుడు (పరిచయం): అమర్‌ కౌశిక్‌ (స్త్రీ).
ఉత్తమ సహాయ నటుడు: గజరాజ్‌ రావు (బదాయీ హో), విక్కీ కౌశల్‌ (సంజు).
ఉత్తమ సహాయ నటి: సురేఖ సిక్రి (బదాయీ హో).

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: పద్మావత్‌.

ఉత్తమ గాయకుడు: అర్జీత్‌ సింగ్‌ (రాజీ-యే వతన్‌).
ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్‌ (పద్మావత్‌-ఘూమర్‌).

64th Filmfare Awards 2019 Winners