- Advertisement -
పారిస్: గత ఏడాది మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా 65మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వ్యక్తిగత, ఇతర ద్వేషాలతో 2017లో జర్నలిస్టులు అత్యంత క్రూరంగా చంపబడ్డారు. ఇదే విషయాన్ని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ తన వార్షిక నివేదికలో ప్రకటించింది. మొత్తం మృతుల్లో 60శాతం మంది వ్యక్తిగత కక్షతోనే హత్యగావించబడ్డారని తన వార్షిక నివేదికలో తెలిపింది. 202 మంది జర్నలిస్టులను బెదిరిచడం, నిర్భంధన చేశారని రిపోర్టర్స్ నివేదిక తెలిపింది. మరో 54మంది పత్రికా విలేఖరులను సైతం ఉగ్రవాదులు నిర్బంధించారని సంస్థ పేర్కొంది. అలాగే విధుల్లో ఉన్న 26మంది జర్నలిస్టులు హత్య గావించబడ్డారు.
సిరియా, చైనా, వియాత్నం, ఇరాన్ లలో జర్నలిస్టులపై విపరీతంగా ఆంక్షలు ఉన్నాయని, అక్కడ జర్నలిస్టుగా ఉద్యోగం చేయడమంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమేనని సంస్థ తెలిజచేసింది.
65 journalists and media workers were killed in 2017
- Advertisement -