Thursday, March 28, 2024

అమెరికాలో వారంలో 6,50,000 ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

6,50,000 Omicron cases per week in America

73 శాతం ఈ వేరియంట్‌వే..!
టెక్సాస్‌లో మొదటి మరణం..!!

న్యూయార్క్: అమెరికాలో నమోదవుతున్న కొవిడ్19 కేసుల్లో ఒమిక్రాన్ కేసులు ప్రథమ స్థానానికి చేరుకున్నాయని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గత వారంలో నమోదైన కేసుల్లో 73 శాతం ఈ వేరియంట్‌వేనని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(సిడిసి) డైరెక్టర్ రోచెల్లే వాలెన్‌స్కీ తెలిపారు. వారం రోజుల్లో 6,50,000 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతవారంతో పోలిస్తే ఈ వేరియంట్ కేసులు ఆరు రెట్లు పెరిగాయని ఆమె పేర్కొన్నారు.

తాజాగా న్యూయార్క్, ఆగ్నేయ, పారిశ్రామిక మధ్య పశ్చిమ, వాయువ్య పసిఫిక్ ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లో 90 శాతంపైగా ఒమిక్రాన్ కేసులేనన్నారు. సోమవారం టెక్సాస్ రాష్ట్రంలోని హారిస్ కౌంటీలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి చనిపోయారని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ వేరియంట్ వల్ల అమెరికాలో సంభవించిన మొదటి మరణమిది. బాధితుడు 5060 ఏళ్ల మధ్య వయస్కుడని, వ్యాక్సిన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు. బ్రిటన్‌లో సోమవారానికి ఈ వేరియంట్ వల్ల మృతి చెందినవారి సంఖ్య 12కు చేరింది.

సిడిసి డేటా ప్రకారం ఈ ఏడాది జూన్ చివరి నుంచి నవంబర్ చివరి వరకు అమెరికాలో నమోదైన కేసుల్లో 99.5 శాతంకుపైగా కేసులు డెల్టా వేరియంట్‌వే. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పుడు యుకె, యూరోపియన్ దేశాలతోపాటు మొత్తం 90 దేశాలకు వ్యాపించింది. నవంబర్ 26న ప్రపంచ ఆరోగ్యశాఖ ఈ వేరియంట్‌ను ఆందోళన కలిగించేదిగా ప్రకటించింది. నెలరోజుల్లోపే ఇది ప్రపంచాన్ని చుట్టేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News