Home Default తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

6551 New Corona Cases Registered In Telanganaహైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 6,551 మంది కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం ఉదయం మీడియాకు తెలిపారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,804 మంది కరోనా నుంచి కోలుకోగా, 43 మంది కరోనాతో చనిపోయినట్టు వారు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 4,01,783కు పెరిగిందని, ఇప్పటివరకు 3,34,144 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు  2,042 మంది కరోనాతో చనిపోయారని అధికారులు చెప్పారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 1,418 మంది కరోనా బారినపడినట్టు వారు వెల్లడించారు.  మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 554 మంది, రంగారెడ్డిలో 482మంది, నిజామాబాద్‌లో 388మంది , సంగారెడ్డిలో 368 మంది, వరంగల్‌ అర్బన్‌లో 329 మంది, జగిత్యాలలో 276మంది, కరీంనగర్‌లో 222మంది, మహబూబ్‌నగర్‌లో 226మంది , సిద్దిపేటలో 268మంది కొత్తగా కరోనా బారినపడినట్టు వారు చెప్పారు. ఆదివారం తెలంగాణలో 73,275 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని , లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అదికారులు హెచ్చరించారు.