Friday, April 19, 2024

24 గంటల్లో 942 మంది మృతి

- Advertisement -
- Advertisement -

24 గంటల్లో 942 మంది మంది మృతి
47 వేలు దాటిన కరోనా మరణాలు
బ్రిటన్‌ను వెనక్కి నెట్టేసిన భారత్
కొత్తగా 66,999 మందికి వైరస్
24 లక్షల చేరువలో పాజిటివ్ కేసులు

66999 New Corona Cases Registered in India

న్యూఢిల్లీ: దేశంలో దేశలో కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతోంది. నిత్యం 900 మందికి పైగా కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 942 మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గురువారం నాటికి ఈ వైరస్ సోకి మృత్యువాత పడిన వారి సంఖ్య47,033కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కి నెట్టేసింది. దాదాపు 46,700 మరణాతో ఉన్న బ్రిటన్ ఐదో స్థానానికి పడిపోయింది. కాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 60 వేల కేసులు వెలుగు చూస్తుండగా తాజాగా బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 66,999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23,96,637కు చేరుకుంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం ఊరట కలిగిస్తున్న అంశం. నిన్న ఒక్క రోజే 56 వేల మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా తాజా మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 344 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన బాధితుల సంఖ్య 18,650కు చేరుకుంది. కాగా తమిళనాడులో కొత్తగా మరో 119 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడ ఇప్పటివరకు చనిపోయిన బాధితుల సంఖ్య 5,278కి చేరుకుంది. కర్నాటకలో మరో 112మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,510కి చేరుకుంది. కాగా, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్న విషయం తెలిసిందే. తాజాగా గడచిన 24 గంటల్లో అక్కడ వెయ్యికి లోపే కొత్త కేసులు నమోదు కాగా 14 మంది మాత్రమే మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశ రాజధానిలో మృత్యువాత పడిన మొత్తం బాధితుల సంఖ్య 4,153కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 93 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,279కి చేరుకుంది. యుపి, పశ్చిమ బెంగాల్‌లలో 54 మంది చొప్పున మరణించారు. దీంతో యుపిలో మొత్తం మరణాల సంఖ్య 2,230కి చేరుకోగా, పశ్చిమ బెంగాల్‌లో 2,203 మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు.

కోలుకున్న సిద్దరామయ్య
కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోలుకున్నారు. రెండోసారి ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌అని రావడంతో డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 3న కరోనా వైరస్‌సోకడంతో ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కాగా వైద్యుల సలహా మేరకు ఆయన మరో వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. గత పది రోజులుగా తనకు వైద్య సేవలందించిన ఆస్పత్రి సిబ్బందికి, త్వరగా కోలుకోవాలని తన కోసం ప్రార్థనలు చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కర్నాటకలో వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా నిన్న ఒక్క రోజే 7,883 కేసులు బైటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్ంత కేసుల సంఖ్య 1.96 లక్షలను దాటేసింది. ఇప్పటివరకు 1,12,633 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 80,343 యాక్టివ్ కేసులున్నాయి.

66999 New Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News