Home తాజా వార్తలు శబరిమలలో నిరసనలు…68 మంది అరెస్టు

శబరిమలలో నిరసనలు…68 మంది అరెస్టు

sabarimala

శ‌బ‌రిమ‌ల:  శ‌బ‌రిమ‌లలో సోమవారం అయ్య‌ప్ప స్వామి భక్తులను పోలీసులు అరెస్టు చేశారు. శబరిమలలో జరుగుతున్న వార్షిక మండల మకరవిళక్కు మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న మహిళలను ఆల‌యంలోకి ప్ర‌వేశించకుండా ఆందోళ‌న చేప‌డుతున్న68 మంది అయ్య‌ప్ప భ‌క్తులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ‌బ‌రిమ‌లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాగా, అరెస్టు అయిన 68 మందిని పోలీసులు పుజ‌పురా సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కెజి ఆల్ఫోన్స్ కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. శ‌బ‌రిమ‌ల‌ను ప్ర‌భుత్వ‌మే యుద్ధ భూమిగా మారుస్తోంద‌ని, ఆల‌యం వ‌ద్ద స‌రైన సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని ఆయన విమ‌ర్శించారు.  అరెస్టు అయిన వాళ్లు భ‌క్తులు కాదని, వాళ్లు ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు అని ఈ సందర్భంగా కేరళ సిఎం పినరయి విజ‌య‌న్ ఆరోపించారు.

68 people taken into custody in sabarimala