Home తాజా వార్తలు తెలంగాణపై కరోనా పంజా

తెలంగాణపై కరోనా పంజా

6876 New Corona Cases Registered In Telanganaహైదరాబాద్‌ : తెలంగాణపై కరోనా పంజా విసురుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 6,876 మంది కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం మీడియాకు తెలిపారు.  గడిచిన  24గంటల్లో కొత్తగా  7,432 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు.  సోమవారం  70,961 మందికి కరోనా పరీక్షలు చేశామని, ఈ క్రమంలో కొత్తగా 6,876 కేసులు నమోదయ్యాయని వారు చెప్పారు.  ప్రస్తుతం తెలంగాణలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 1,029 మంది, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 502మంది , రంగారెడ్డి జిల్లాలో 387మంది కరోనా బారినపడ్డారని అధికారులు తెలిపారు. తెలంగాణలో  కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,63,361కు పెరిగిందని. ఇప్పటి వరకు 3,81,365 మంది కోలుకున్నారని వారు వెల్లడించారు. .ఇప్పటివరకు  2,476 మంది కరోనాతో చనిపోయారని, కరోనా  మరణాల రేటు 0.53 శాతం ఉందని, రికవరీ రేటు 82.30శాతం ఉందని అధికారులు స్పష్టం చేశారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే బహిరంగ ప్రదేశాలకు రావాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలను కోరారు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను ప్రతిఒక్కరు కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలను హెచ్చరించారు.