Friday, April 26, 2024

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..

- Advertisement -
- Advertisement -

7 Cases of AY.4.2 Variant of Corona in Karnataka

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఏడుగురికి ఏవై 4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు.ఈ వేరియంట్ బాధితులను గుర్తించిన అధికారులు.. బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగతా నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారని తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు.. ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించనుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ చెప్పారు. ఏవై.4.2 రకం అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్​కు పంపినట్లు మంత్రి తెలిపారు. ఈ వేరియంట్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జన్యు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రంలో ఆరు లేదా ఏడు ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.సుధాకర్ పేర్కొన్నారు.

7 Cases of AY.4.2 Variant of Corona in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News