Home తాజా వార్తలు కొవిడ్ ప్రతాపం

కొవిడ్ ప్రతాపం

7 deaths 1879 new Covid-19 cases in Telangana

 

1879 కొత్త కేసులు, ఏడుగురు మృతి
జిహెచ్‌ఎంసిలో 1422, జిల్లాల్లో 457 మందికి
బస్‌భవన్‌లో, జిహెచ్‌ఎంసి కార్యాలయాల్లో కరోనా కలకలం
బడంగ్‌పేట్ మేయర్‌కు వైరస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. రోజుకో కొత్త ప్రాంతంలో కేసులు నమోదవుతూ అంతటా విస్తరిస్తుంది. అన్‌లాక్ పీరియడ్‌లో ప్రజలతో పాటు వైరస్ కూడా చుట్టుముడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మరో 1879 కేసులు నమోదుకాగా, ఏడుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1422 మంది ఉండగా, రంగారెడ్డిలో 176, మేడ్చల్ 94, సంగారెడ్డి 9,కరీంనగర్ 32, మహబూబ్‌నగర్ 11, కామారెడ్డి 7, గద్వాల 4, నల్గొండ 4, వరంగల్ అర్బన్ 13, నిజామాబాద్ 19, వికారాబాద్ 1, మెదక్ 12, పెద్దపల్లి 3, సూర్యాపేట్ 9, ఖమ్మం 3, జగిత్యాల 2,మహబూబాబాద్ 2, జయశంకర్ భూపాలపల్లి 6, భద్రాది 3, సిరిసిల్లా 2, ఆదిలాబాద్ 1, జనగాం 1, ములుగు 12, నాగర్ కర్నూల్ 2, వనపర్తి 1, సిద్ధిపేట్‌లో ఒకరు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 27612కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 16287కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 11012మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 313కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

బస్‌భవన్, జిహెచ్‌ఎంసి కార్యాలయాల్లో కరోనా కలకలం..
హైదరాబాద్ బస్‌భవన్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో ఆరుగురికి కరోనా సోకింది. దీంతో మిగతా సిబ్బందిలోనూ కలవరం ప్రారంభమైంది. రెండో, ఐటీ, ఒపిటీ విభాగాల్లో పనిచేస్తున్న ఆరుగురు ఉన్నతాధికారులకు, సిబ్బందికి కోవిడ్ తేలడంతో వీరంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్లందరీ ప్రైమరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు అబిడ్స్ సర్కిల్ 15,16 జిహెచ్‌ఎంసి విభాగాల కార్యాలయంలోనూ కరోనా దడపుట్టిస్తుంది. ఈ విభాగాల్లో ఆరోగ్య అధికారులతో పాటు సిబ్బంది కూడా కోవిడ్ తేలడంతో అక్కడ సిబ్బంది క్వారంటైన్‌లోకి వెళ్లారు. అదే విధంగా బడంగ్‌పేట్ మేయర్‌కూ కోవిడ్ సోకినట్లు సమాచారం. దీంతో వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశామని అధికారులు తెలిపారు.

గొంగిడి సునీత, ఆమె భర్తకు ఫోన్‌లో మంత్రుల పరామర్శ
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను, ఆమె భర్త టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిని మంగళవారం మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డిలు ఫోన్‌లో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసిన మంత్రులు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బెడ్ల సమాచారం..
బెడ్ల వివరాలు          అందుబాటులో       నిండినవి           ఖాళీ
ఐసోలేషన్              11,928            660             11268
ఆక్సిజన్                3537               496             3041
ఐసియూ               1616               179             1437
మొత్తం                 17,081            1335            15746

7 deaths 1879 new Covid-19 cases in Telangana