Home జాతీయ వార్తలు విద్యార్థులపై లైంగిక వేధింపులు… ఏడుగురు ఉపాధ్యాయులు అరెస్టు

విద్యార్థులపై లైంగిక వేధింపులు… ఏడుగురు ఉపాధ్యాయులు అరెస్టు

 

రాయ్ పూర్: తొమ్మిదోవ తరగతి విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్ లోని బలోదాబజార్ జిల్లాలో చోటుచేసుకుంది. కాస్డోల్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఏడుగురు ఉపాధ్యాయులు… దేవేంద్ర ఖుంటే(38), రామేశ్వర్ ప్రసాద్ సాహు(44), రూపనారాయణ సాహు(36), మహేష్ కుమార్ వర్మ(37), దినేష్ కుమార్ సాహు(38), చదన్ దాస్ బాగెల్ (39), లాల్రామ్ బెర్వాన్షులు మార్దా గ్రామంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనవరి 2018లో, ఖుంటే పాఠశాల విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత అతను బాలికలలో ఒకరిని ఇంటికి తీసుకెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. రామేశ్వర్ ప్రసాద్ కూడా మరో బాలికకు అశ్లీల కాల్స్ చేశాడు. మరో ఐదుగురు నిందితులు కూడా బాలికలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఎవరికైన చెబితే పరీక్షలో ఫెయిల్ చేస్తామని నిందితులు ఆ ఇద్దరి బాలికలను బెదిరంచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు గురువారం ఆ స్కూల్లో జరిగిన మేనేజ్ మెంట్ కమిటీ మీటింగ్ లో నిందితులపై ఆరోపణలు చేస్తూ, స్కూల్ ప్రిన్స్ పాల్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై పోస్కో చట్టం, భారతీయ శిక్షా స్మృతి, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ(దురాగతాల నివారణ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మార్దా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాస్డోల్ దిన్‌బంధు ఉయికే తెలిపారు.

7 Govt School Teachers Arrest for Molesting Students