Home తాజా వార్తలు టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ రూ.1,37,396 కోట్ల వృద్ధి

టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ రూ.1,37,396 కోట్ల వృద్ధి

7 of top 10 most valued firms add Rs 1.37 lakh crore

 

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభాల బాటలో సాగిన నేపథ్యంతో టాప్ 10 కంపెనీల్లోని ఏడు కంపెనీల మార్కెట్ విలువ ఒక్క సారిగా రూ.1,37,396.66 కోట్ల మేర పెరిగింది. ఇందులో టిసిఎస్ అత్యధికంగా లాభపడింది. ఇదేకాక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్( హెచ్‌యుఎల్), ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌ల మార్కెట్ విలువ కూడా బాగానే పెరిగింది. దీనికి భినంగా కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహింద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఎంక్యాప్ తగ్గడం గమనార్హం. టిసిఎస్ మార్కెట్ విలువ రూ.72,102,07 కోట్లు పెరిగి రూ.11.70,875.36 కోట్లకు చేరగా, ఇన్ఫోసిస్ విలువ 21.894.20 రూపాయలు పెరిగి రూ.5,58,772.73 కోట్లకు చేరుకుంది.

హెచ్‌డిఎఫ్‌సి రూ.15,076.62 కోట్లు లబ్ధి పొందడంతో దాని మార్కెట్ విలువ రూ.4,77,663.03 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ విలువ రూ.13,720 కోట్లు పెరిగి మొత్త మార్కెట్ విలువ రూ.2,94,736.49 కోట్లకు చేరుకుంది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.10,054 కోట్లు పెరిగి మొత్తం విలువ రూ.3,74,253.88 కోట్లకు చేరుకుంది. కాగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.3,855.36 కోట్లు పెరిగింది. దీంతో ఆ సంస్థ మార్కెట్ విలువ రూ.7,88,613.86 కోట్లకు చేరుకుంది. కాగా హెచ్‌యుఎల్ మార్కెట్ విలువ రూ.693.12 కోట్లు పెరిగి రూ.5,61,626.18 కోట్లకు చేరుకుంది.

మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.34,296.37 కోట్లు తగ్గి రూ.12,25,445.59 కోట్లకు చేరుకోగా, బజాజ్ ఫైనాన్స్ విలువ రూ.12,024.63 కోట్లు తగ్గి రూ.3,06,156.55 కోట్లకు చేరింది. చివరగా కొటక్ మహింద్రా బ్యాంక్ విలువ రూ.4,661.65 కోట్లు తగ్గి రూ.3,90,253.33 కోట్లకు చేరింది. గత వారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 913.53 పాయింట్లు లబ్ధి పొందిన విషయం తెలిసిందే. కాగా టాప్10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ప్రథమ స్థానంలో కొనసాగుతుండగా, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, కొటక్ మహింద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ వరసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

7 of top 10 most valued firms add Rs 1.37 lakh crore