- Advertisement -
మనతెలంగాణ / గంభీరావుపేట : దివ్యాంగులకు అన్నిరంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా 7శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం మండల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దివ్యాంగులమైన తమకు రిజర్వేషన్‌లు కల్పించి అన్నింటా ప్రాతినిద్యం కల్పించేందుకు కృషిచేయాలన్నా రు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే 7శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఈ ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ఏఎస్సై జాఫర్ షరీప్ చేరుకుని శాంతిపంచేశారు. ఆందోళనలో దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి చేని వెంకటస్వామి, మండల ఉపాధ్యక్షుడు పెంటయ్య, నాయకులు ఆశయ్య, శ్రీనివాస్, సత్యం, పాల్గొన్నారు.
- Advertisement -