బ్యాడ్మింటన్‌లో కరోనా కల్లోలం
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కొవిడ్ మహమ్మరి మరోసారి క్రీడలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కరోనా కలకలం సృష్టించింది. భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌తో పాటు మరో ఆరుగురు క్రీడాకారులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయా న్ని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టార్ ఆటగాడు శ్రీకాంత్‌తో అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్, ట్రీసా జాలీ, మిథున్ ముంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు కరోనా బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం ఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొంటున్నారు. వీరికి కరోనా ఉన్నట్టు తేలడంతో టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. ఇదిలావుండగా కరోనా బారిన షట్లర్లకు మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తామని టోర్నీ నిర్వాహకులు తెలిపా రు. ప్రస్తుతం కరోనా సోకిన క్రీడాకారులందరూ ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉన్నారని, వీరికి ప్రముఖ వైద్యులు పర్యవేక్షణలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఇదిలావుండగా కరోనా కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇండియా ఓపెన్‌ను కొనసాగిస్తారా లే క వాయిదా వేస్తారా అనేది ఇంకా తేలలేదు.
7 players including srikanth test positive for covid