Friday, April 26, 2024

7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

NIRANJAN REDDY

 

కరోనా నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్‌కు ధాన్యం తీసుకరావద్దు
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి
రాజపేట,కొత్తకోటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : ఈ రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్,సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజ పేట , కొత్తకోట మండల కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ రబీలో రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఎకరాల్లో వరి పంట పండినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం 3 వేల కొనుగోలు కేంద్రా లు మాత్రమే ఉండేవని, అయితే ఈ సంవత్సరం సాగునీటి ప్రాజెక్టుల కారణంగా ధాన్యం పొటెత్తినందున 7వేల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు , క్రమపద్ధతిలో ధాన్యాన్ని కొనుగోలు చేసే నిమిత్తం ఐకెపి, పిఎసిఎస్‌ల ద్వారా పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు తదితర ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్‌కు రాకుండా అన్ని గ్రామ పంచాయతీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.. టోకన్ సీరియల్ ప్రకారం ముందే జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. వ్యవసాయ , సహకార, మార్కెటింగ్ ,రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

రైతులు ఎలాంటి పాస్‌బుక్‌లు చూపించాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకు ఖాతా నెంబర్‌కు సంబంధించిన వివరాలను మాత్రం నమోదు చేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు రావద్దని, సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాష, ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎంపిపి కిచ్చారెడ్డి, కొత్తకోట ఎంపిపి గుంత మౌనిక, జడ్‌పి వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జయమ్మ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బాలనారాయణ, మాజి జడ్‌పిటిసి పిజెబాబు, డిఎఒ సుధాకర్‌రెడ్డి, డిసిఎస్‌ఒ రేవతి, డిసిఎస్ మేనేజర్ లక్ష్మయ్య, మార్కెటింగ్ ఎడి స్వరణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

7 thousand grain buying centers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News