Thursday, April 25, 2024

నాలుగేళ్లలో 40 వేల కి.మీ కాలినడక

- Advertisement -
- Advertisement -

70 years old apply for Guinness world record

లండన్ : పంజాబ్‌లో పుట్టినా గత 40 ఏళ్లుగా ఐర్లాండ్‌లో నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్లలో నలభై వేల కిమీ దూరం కాలి నడక సాగించాడు. ఈ ఎర్త్ వాక్ పూర్తయిన తరువాత గిన్నిస్ రికార్డుకు తన పేరున దరఖాస్తు పంపాడు. వినోద్ బజాజ్‌అనే ఈ వృద్ధుడు 2016 ఆగస్టులో తన ప్రయాణం ప్రారంభించి కొంత బరువును కోల్పోయి, ఫిట్‌నెస్ సాధించారు. వాతావరణ ప్రతికూలతల నుంచి తప్పించుకోడానికి ఆయన వివిధ రూట్ల ద్వారా ఇన్‌డోర్ మాల్స్ మీదుగా ఈ నడక సాగించారు. కొన్ని కిలోగ్రాముల బరువును తగ్గించుకోగలిగారు.

వారానికి ఏడు రోజుల పాటు మొదటి మూడు నెలలు తాను నడక సాగించి రోజుకు 700 కేలరీల వంతున ఎనిమిది కిలోల బరువును తగ్గించుకోగలిగానని, తరువాతి ఆరు నెలల్లో మరో 12కిలోల బరువు తగ్గానని, ఆహార అలవాట్లు ఏమాత్రం మార్చుకోకుండా కేవలం నడక ద్వారానే శరీరం బరువు తగ్గించుకోగలిగానని ఆయన చెప్పారు. రిటైర్డ్ ఇంజినీర్,బిజినెస్ కన్సల్టెంట్ అయిన ఈయన చెన్నైలో పెరిగారు. గ్లాస్గో నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీపొందడానికి 1975 లో స్కాట్లాండ్ వెళ్లాక 43 ఏళ్ల క్రితం ఐర్లాండ్ వెళ్లారు. అక్కడ లిమెరిక్ అనే సబర్బన్ ప్రాంతం కేసిల్ ట్రాయ్‌లో కుటుంబంతోపాటు 36 ఏళ్లు నివసించారు. తన అడుగులు పూర్తిగా ట్రాక్ చేయడానికి వీలుగా తన స్మార్ట్‌ఫోన్‌కు పాసెర్ యాక్టివిటీ ట్రాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News