Home తాజా వార్తలు పివి సింధుతో పెళ్లి చేయండి…

పివి సింధుతో పెళ్లి చేయండి…

PV-Sindhuచెన్నై: తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే (70) ఏళ్ల వృద్ధుడు ప్రపంచ వరల్డ్ బ్యాడ్మింటన్, భారత స్టార్ షట్లర్ పిపి సింధుతో వివాహం జరిపించాలని ఏకంగా జిల్లా కలెక్టర్ కు పిటిషన్ ఇచ్చారు. పెళ్లికి ఏర్పాట్లు చేయకుంటే ఆమెను కిడ్నాప్ చేసైనా సరే వివాహం చేసుకుంటానని చెప్పాడు. సింధు ఆట తీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టాడు. అయితే, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పైగా ఆ వృద్ధుడు పిటిషన్ లో తన వయసు 16 ఏండ్లని, 2004 ఏప్రిల్‌ 4 న పుట్టానని చెప్పాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌ తిన్నారు. ఈ అభ్యర్థనను చూసి కలెక్టర్ కూడా కంగు తిన్నారు.

70 Years old man A Petition He Wants To Marry PV Sindhu