Friday, April 26, 2024

కోవిడ్ 19పై పోరాటానికి వాలంటీర్లు ముందుకు రావాలి: కేంద్ర ఆరోగ్యశాఖ

- Advertisement -
- Advertisement -

lav agarwal

 

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు దేశంలో 18,601 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 705 మంది డిశ్చార్జ్ అయ్యినట్లు తెలిపింది. దేశంలో కరోనా అదుపులో ఉందని, కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ మరింత కఠినం చేయనున్నట్లు పేర్కింది. దేశంలో వాలంటీర్ల కొరత ఉందని.. కోవిడ్ 19పై పోరాటానికి వాలంటీర్లు స్వచ్చందంగా ముందుకు రావాలని, వాలంటీర్లకు ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తామని తెలిపింది. కోవిడ్ 19 వారియర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం డేటా బేస్ రూపొందించిందని, డేటా బేస్ లో ఇప్పటివరకు కోటీ మంది రిజిస్టర్ అయినట్లు చెప్పింది. రెండ్రోజుల పాటు ర్యాపిడ్ కిట్స్ ఉపయోగించొద్దని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించిందని, టెస్టు కిట్లపై పరీక్షలు జరిపిన తర్వాతే ఉపయోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

705 Corona Patient Discharged in 24 hrs: Lav Agarwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News