Thursday, April 18, 2024

చిన్నారులకు కరోనా మూడో ముప్పుపై భయం వద్దు: సీరో సర్వేవెల్లడి

- Advertisement -
- Advertisement -

71% of children have Covid antibodies

 

న్యూఢిల్లీ : చిన్నారులకు కరోనా మూడో ముప్పు ప్రభావం చూపే అవకాశం ఉందని అనేక నివేదికల్లో నిపుణులు ఆందోళన వెలిబుచ్చినా అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీరో సర్వే వెల్లడించింది. చండీగఢ్ లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (పీజిఐఎంఈఆర్) నిర్వహించిన సీరో సర్వేలో ఆశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రానున్న ముప్పు గురించి మరీ అంత ఆందోళన అవసరం లేదని తెలిపింది. 2700 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా, 71 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. దీనిపై పీజీఐఎంఈఆర్ డైరెక్టర్ డాక్టర్ జగత్‌రామ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

చండీగఢ్, మురికివాడలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ఈ నమూనాలను సేకరించినట్టు చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి వెలువడిన సీరో సర్వేల్లో కూడా 50 నుంచి 75 శాతం మంది చిన్నారుల్లో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. మన దేశంలో చిన్నారులకు టీకా అందుబాటులో లేదు. కరోనా సోకిన కారణం గానే వారిలో యాంటీబాడీలు కనిపించాయి. దీన్ని బట్టి మూడో ముప్పు పిల్లల్ని ప్రభావితం చేస్తుందని తానుభావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 6 నుంచి 10 శాతం మందిలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించినట్టు చెప్పారు. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News