Thursday, April 25, 2024

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: మోడీ

- Advertisement -
- Advertisement -

72 Republic day wishes by PM Modi

 

న్యూఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత ప్రజలందరికీ ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. జై హిందు అంటూ ట్విట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు.

గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌ను దృష్టిలో ఉంచుకొని  ఢిల్లీలో భద్రతా దళాలు  భారీగా మోహరించాయి.  “కిసాన్ గణతంత్ర పరేడ్” పేరుతో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజ్‌పథ్‌లో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో భాతర సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, దేశ  సాంఘిక, ఆర్థిక ప్రగతి ప్రతిబింబించేలా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఢిల్లీలో ఓవైపు రిపబ్లిక్ డే పరేడ్, మరోవైపు రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉండటంతో భద్రతను పటిష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దులతోపాటు రాజ్‌పథ్ మార్గంలో వేలాదిమంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 8 కిలోమీటర్ల రాజ్‌పథ్ మార్గంలో ఎత్తైన భవనాలపై నుంచి గమనించేందుకు షార్ప్ షూటర్స్‌తోపాటు స్నైపర్స్‌ను(దూరం నుంచి అనుమానితులను గురిపెట్టి కాల్చగల నిపుణులు) ఏర్పాటు చేశారు.

ఢిల్లీ సరిహద్దుల నుంచి రిపబ్లిక్ డే పరేడ్ జరిగే రాజ్‌పథ్ వరకు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రాజ్‌పథ్ మార్గంలో 6000మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈశ్‌సింఘాల్ తెలిపారు. రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమానికి ఈసారి 25,000మందికే అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ప్రతి ఏటా లక్షమంది దాకా రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యేవారు. కొవిడ్ నిబంధనల వల్ల ఈసారి ఆ సంఖ్యనుతగ్గించారు.

పరేడ్ జరిగే మార్గంలో 140 సిసి టీవీలను ఏర్పాటు చేసి, ఫేసియల్ రికగ్నిషన్ సాంకేతికతను అనుసంధానం చేసినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అనుమానిత ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులకు సంబంధించి దాదాపు 50,000 మందిని గుర్తించే ఫేసియల్ టెక్నాలజీతో నిఘాను పటిష్టం చేసినట్టు ఆ అధికారి తెలిపారు. రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించే ఢిల్లీ శివారుల్లోనూ భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర పోలీస్ బలగాల(సిఎపిఎఫ్)తో ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్ట్‌ను ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాస్తవ పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ పూర్తయిన తర్వాతనే ట్రాక్టర్ పరేడ్ ఉంటుందని ఇప్పటికే రైతు సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనేవారు ఎలాంటి ఆయుధాలుగానీ, మత్తు పదార్థాలుగానీ కలిగి ఉండొద్దని రైతు సంఘాలు ఆదేశించాయి. శాంతియుతంగానే తమ నిరసన ఉంటుందని రైతు నేతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News