Thursday, April 25, 2024

94 దేశాలకు 723 లక్షల డోసుల టీకాల్ని ఎగుమతి చేశాం: కేంద్రం

- Advertisement -
- Advertisement -

723 lakh doses of vaccine were exported to 94 countries

 

న్యూఢిల్లీ: 94 దేశాలతోపాటు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన రెండు సంస్థలకు దేశం నుంచి 723.435 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లను ఎగుమతి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా నవంబర్ 29 వరకు ఈ వ్యాక్సిన్లను ఎగుమతి చేసినట్టు తెలిపింది. ఇందులో పేద దేశాల కోసం ఐరాస చేపట్టిన కొవాగ్జ్ కార్యక్రమానికి పంపినవి 222.56 లక్షల డోసులని పేర్కొన్నది. మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌పవార్ లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ వివరాలు పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి నుంచి ఉపశమనం కలిగించే ఔషధాలను 150 దేశాలకు సరఫరా చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది సెకండ్‌వేవ్ సమయంలో 50 దేశాల నుంచి సహాయంగా పంపిన మందులు, పరికరాలను మన దేశం స్వీకరించినట్టు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News