Friday, March 29, 2024

75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా

- Advertisement -
- Advertisement -

BSF jawans

ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్‌ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని వెల్లడించింది. ప్రస్తుతం 193 బిఎస్‌ఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకగా ఇద్దరు మరణించారు. సిఆర్‌పిఎఫ్‌లో 162 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకగా ఒకరు మృతి చెందారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

కరోనాతో ముగ్గురు జవాన్లు చనిపోవడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. కరోనా వైరస్‌తో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఐటిబిపిలో కూడా 82 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకింది. త్రిపుర (35), కోల్‌కతా (6), ఢిల్లీ(135) మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ 56,532 మందికి వ్యాపించగా దాదాపుగా 1900 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 1122కు చేరుకోగా 29 మంది చనిపోయారు.

రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు:
రాష్ట్రాల& కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
17,974 13,979 3,301 694
గుజరాత్ 7,013 4,879 1,709 425
ఢిల్లీ 5,980 3,983 1,931 66
తమిళనాడు
5,409 3,825 1,547 37
రాజస్థాన్ 3,453 1,450 1,903 1100
మధ్య ప్రదేశ్
3,252 1,828 1,231 193
ఉత్తర ప్రదేశ్
3,071 1,759 1,250 62
ఆంధ్రప్రదేశ్
1,887 1,004 842 341
పంజాబ్
1,644 1,467 149 28
పశ్చిమ బెంగాల్ 1,548 1,101 296 151
తెలంగాణ 1,122 400 693 29
జమ్ము కశ్మీర్
793 449 335 9
కర్నాటక 750 348 371 30
హర్యానా 633 355 270 8
బిహార్
563 340 218 5
కేరళ
503 25 474 4
ఒడిశా 245 180 63 2
ఛండీగఢ్
135 113 21 1
ఝార్ఖండ్ 132 88 41 3
త్రిపుర
88 86 2 0
ఉత్తరాఖండ్ 61 21 39 1
ఛత్తీస్ గఢ్
59 23 36 0
అస్సాం 54 17 35 2
హిమాచల్ ప్రదేశ్
46 6 34 3
లడఖ్ 42 25 17 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ
12 1 10 1
పుదుచ్చేరీ 9 3 6 0
గోవా 7 0 7 0
మణిపూర్ 2 0 2 0
మిజోరం 1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్
1 0 1 0
దాద్రా నగర్ హవేలీ / డమాన్ డయ్యూ
1 1 0 0
మొత్తం
56,523 37,756 16,868 1,895

 

దేశాల వారిగా కరోనా వివరాలు:

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News