Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఆంధ్రాలో కొత్తగా 76 కేసులు.. ఇద్దరు మృతి

ఆంధ్రాలో కొత్తగా 76 కేసులు.. ఇద్దరు మృతి

76 New Coronavirus Cases found in AP

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో ఎపిలో 10,567 సాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,118కి చేరింది. ప్రస్తుతం 885 మంది చికిత్స పొందుతుండగా… ఈ వ్యాధి నుంచి 34 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా..  ఇప్పటి వరకు 2,169 మంది కొలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మొత్తం 64 మంది మరణించారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో నెల్లూరులో 8 మందికి కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చారని సమాచారం.

76 New Coronavirus Cases found in AP