Friday, April 19, 2024

11.58 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

- Advertisement -
- Advertisement -

78 days bonus for 11.58 lakh railway employees

న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి రైల్వేలో పనిచేస్తున్న దాదాపు 11.58 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ ప్రకటించినట్లు భారతీయ రైల్వేలు గురువారం తెలిపాయి. రైల్వే ఉద్యోగులకు అందచేసే ఈ ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ కోసం రూ. 2081.68 కోట్లు కేటాయించినట్లు అంచనా. ఉద్యోగులకు బోనస్ చెల్లించాలని రైల్వే మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఆర్‌పిఎఫ్/ఆర్‌పిఎస్‌ఎఫ్ మినహాయించి మిగిలిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరికీ ఈ బోనస్ లభిస్తుంది.

78 రోజుల వేతనంతో సమానమైన ఉద్పాదకతతో ముడిపడిన బోనస్ చెల్లింపులకు రూ. 2081.68 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి 78 రోజుల వేతనం కింద రూ. 17,951 బోనస్ లభిస్తుంది. ఈ నిర్ణయంతో సుమారు రూ. 11.58 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని రైల్వేలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రతి ఏటా దసరా పండుగ ముందు బోనస్ చెల్లింపు జరుగుతుందని, ఈ ఏడాది కూడా దసరా సెలవులకు ముందుగానే క్యాబినెట్ నిర్ణయం అమలు జరుగుతుందని రైల్వేలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News