Friday, March 29, 2024

అలాస్కాలో భారీ భూకంపం.. హవాయికి సునామీ ముప్పు

- Advertisement -
- Advertisement -

పెర్రీవిల్లె(అమెరికా): అలాస్కా దీవికి సమీపంలో బుధవారం సాయంత్రం భారీ భూకంపంసంభవించడంతో హవాయికి సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికి జారీ చేసింది. అలాస్కా దీవులకు సమీపంలో సముద్రంలో 8.1 తీవ్రతతను భూకంపం సంభవించినట్లు సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. హవాయికి సునామీ ముప్పుపై పరిశోధన జరుగుతున్నట్లు తెలిపింది. బుధవారం రాత్రి 8.15 గంటలకు అలాస్కాలోని పెర్రివిల్లెకు తూర్పు ఆగ్నేయాన91 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించినట్లు అమెఇకా జియోలాజికల్ సర్వే తెలిపింది. మొదటి భూకంపం వచ్చిన అరగంటలోనే 6.2, 5.6 తీవ్రతలతో మరో రెండు భూకంపాలు అదే ప్రాంతంలో వచ్చినట్లు సర్వే తెలిపింది.

8.1 Magnitude of Earthquake hits Alaska

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News