Home తాజా వార్తలు 36 గంటలైనా దొరకని చిన్నారి ఆచూకీ

36 గంటలైనా దొరకని చిన్నారి ఆచూకీ

8 days baby goes missing

 

తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం
ఆస్పత్రిని సందర్శించిన ఉన్నతాధికారులు

సంగారెడ్డి: సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో 8 రోజుల చిన్నారి అపహరణకు గురై 36 గంటలు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. వివాహమై 12 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ అపహరణకు గురికావడం ఆ కుటుంబానికి తీవ్ర మనోవేదనగా నిలిచింది. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో గత నెల 30న ఆడబిడ్డకు జన్మనిచ్చిన మాధవి ఎంతో సంతోషంతో తన ఇంటికి వెళ్లి మళ్లి 3వ తేదిన కామెర్ల్లు వచ్చాయని ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో మంగళవారం తల్లిపాలకై పిల్లలను పంపించే క్రమంలో అక్కడున్న ఆయా గుర్తించకుండా వేరేవారికి మాధవి, మల్లేశంల బిడ్డను ఇవ్వడం ఆ తర్వాత అపహరణకు గురైన విషయం తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, ఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటుచేసి గాలిస్తున్నారు.

కలెక్టర్ సైతం ఆసుపత్రికి వచ్చి పరిస్థితులను తెలుసుకొని తల్లిదండ్రులను ఓదార్చి ఘటనకు కారకులైన ఇద్దరు ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేశారు. కలెక్టర్ ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జెసి రాజశేఖర్‌బాబు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి వచ్చి శాఖపరమైన ఎంక్లైరీని నిర్వహించారు. మరోపక్క రాజకీయ, సామాజిక వర్గాలు ఆసుపత్రికి చేరుకొని తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని తెలుసుకొని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. తొందరగా ఈ కేసును చేదించి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

8 days baby goes missing at Sangareddy Govet hospital