Saturday, April 20, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

8 death in road accident at Nagarkurnool

రెండు కార్లు ఢీ
ఏడుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం
శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘటన
నుజ్జు నుజ్జైన కార్లు
సంఘటన స్థలానికి విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ శర్మన్

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్/ఉప్పునుంతల : నాగర్‌కర్నూల్ జిల్లా హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై గల ఉప్పునుంతల మండలం రాయిచేడు వద్ద శుక్రవారం సాయంత్రం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొస్న సంఘటనలో ఏడుగురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరా లు ఇలా ఉన్నాయి. శ్రీశైలం వైపు నుంచి వస్తున్న కారు ఎదు రుగా వస్తున్న మరో కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నవారు ఒకరు కాగా మరొక కారులో తిరుగు ప్రయాణం సాగిస్తున్న భక్తులుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. మృతులంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నరేష్ హైద రాబాద్‌లోని బొల్లారంగా గుర్తించామని అతనిని వైద్య చికి త్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల వివరాలు
రెండు కార్లు ఢీ కొన్న సంఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఇటివోస్ వాహనంలో వెళ్తున్న శివకుమార్ అతని భార్య, కుమారు డు, మరో వృద్ధ్దుడు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్‌లోని ఆనంద్‌బాగ్ ప్రాంతానికి చెందిన వారీగా గుర్తించారు. అదే విధంగా మరో కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్‌లోని మల్కాజిగిరి, సుచిత్ర ప్రాంతాలకు చెంది న వంశీ,వెంకట్, నరేష్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. వీరిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉండగా మృతదేహాలను అచ్చం పేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించి, డిఎస్పీ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన స్థలానికి కలెక్టర్, ఎంఎల్‌ఎ
శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శర్మన్, అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజులు అక్కడికి చేరుకుని డిఎస్పీ నరసింహులుతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పా టు చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అచ్చంపేట రోడ్డు ప్రమాదంపై సిఎం దిగ్భ్రాంతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి, సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించి వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News