Home అంతర్జాతీయ వార్తలు టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

texas1హైదరాబాద్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిద మంది అక్కడికక్కడే మృతి చెందగా, 44 మంది గాయపడ్డారు. ఇది అమెరికాలోని టెక్సాస్‌లో ఈప్రమాదం సంభవించింది. దక్షిణ టెక్సాస్‌లోని రిమో గ్రాండ్ నుంచి ఈగల్ పాస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు సమీప వైద్యశాలకు తరలించారు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఢీకొడుతూ వెళ్లి బస్సు బోల్తా పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.