Home జాతీయ వార్తలు కారు-ట్రక్కు ఢీ: ఎనిమిది మంది మృతి

కారు-ట్రక్కు ఢీ: ఎనిమిది మంది మృతి

 

పాట్నా: బీహార్ లోని కాటిహార్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుర్శాలా గ్రామ శివారులో జాతీయ రహదారి 31పై కారు-ట్రక్కు ఢీకొని ఎనిమిది మంది మృత్యువాతపడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు పక్కకు తొలగించారు.  ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.