Home తాజా వార్తలు ఐపిఒలు 95% రాబడి

ఐపిఒలు 95% రాబడి

IPOsఈ ఏడాదిలో 11 ఇష్యూల్లో తొమ్మదింటికి మంచి లాభాలు
స్టాక్స్ కంటే ఆకర్షణీయంగా మారిన ఐపిఒలు

న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లు మంచి రాబడిని ఇచ్చాయి. ఎనిమిది కంపెనీల నుంచి వచ్చిన ఇష్యూలు మదుపర్లకు పంటపండించాయి. ఈ ఏడాది ప్రాథమిక మార్కెట్ పెట్టుబడులను సమీకరించే విషయంలో పెట్టుబడిదారులకు లబ్ధిని చేకూర్చింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్(సెకండరీ మార్కెట్)లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో ప్రాథమిక లేదా ఐపిఒ మార్కెట్ పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయంగా మారింది. గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు 70 శాతం షేర్లు ఇష్యూ ధర కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి.

ఈ స్టాక్స్ పెట్టుబడిదారులకు 95 శాతం రాబడిని ఇచ్చాయి. నిపుణుల ప్రకారం, అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, పెట్టుబడిదారుల మనోభావాలు బలహీనపడటం, విదేశీ పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకోవడం వల్ల మార్కెట్ అస్థిరంగా ఉంది. అయితే మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మంచి ఐపిఒలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటోంది.

95 శాతం వృద్ధి

ఈ ఏడాది అక్టోబర్ 4 వరకు 11 కంపెనీల స్టాక్స్ పనితీరును విశ్లేషించగా, వీటిలో ఎనిమిది ఐపిఒలు ఇష్యూ ధర కంటే 7 నుండి 95 శాతం వరకు మంచి వృద్ధిని చూపాయి. అదే సమయంలో మూడు కంపెనీలు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో విఫలమై, వారి వాటాలు ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడవుతున్నాయి.

మూడు కంపెనీలు విఫలం

మరోవైపు, ఎంఎస్‌టిసి, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, గ్జెల్ప్‌మాక్ డిజైన్ అండ్ టెక్ అనే మూడు కంపెనీలు పెట్టుబడిదారులకు రాబడిని ఇవ్వడంలో విఫలమయ్యాయి. ఎంఎస్‌టిసి మార్చిలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో 24 శాతం కోల్పోయింది. ఆగస్టులో లిస్ట్ అయిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ 23 శాతానికి పైగా పడిపోయింది. అదేవిధంగా గ్జెల్ప్‌మాక్ డిజైన్ అండ్ టెక్ స్టాక్ ఇష్యూ ధర కంటే 4.5 శాతం తగ్గింది.

మార్కెట్ల కంటే ఐపిఒలకే మొగ్గు

ఫండమెంటల్ రీసెర్చ్ (ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్) హెడ్ నరేంద్ర సోలాంకి మాట్లాడుతూ, గత ఏడాదికి పైగా అనేక కారణాల వల్ల మార్కెట్లో ఉత్సాహం లేదు. పెట్టుబడిదారులలో సెంటిమెంట్ బలహీనంగా ఉంది. ఈ పరిస్థితిలో మంచి విలువ కలిగిన ఐపిఒ పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ఈ కంపెనీల పుస్తకాలు క్లీన్‌గా ఉండడం వల్ల పెట్టుబడిదారులు కూడా ఆకర్షితులయ్యారు.

8 out of 11 IPOs of 2019 surge up to 95 Percent