Home అంతర్జాతీయ వార్తలు సోమాలియాలో ఆత్మాహుతి దాడి : 8 మంది మృతి

సోమాలియాలో ఆత్మాహుతి దాడి : 8 మంది మృతి

8 People Died After Suicide Bomb Attack In Somaliaమొగాడిషు : సోమాలియా రాజధాని మొగాడిషులో శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది.  సైనిక స్థావరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది పౌరులు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం కూడా వార్తా-నబడ్డా జిల్లాలోని 12 ఏప్రిల్ ఆర్మీ బ్రిగేడ్ స్థావరం ప్రవేశద్వారం వద్ద ఆత్మాహుతి దాడి జరిగిన విషయం విదితమే. ఈ దాడులు తామే చేసినట్టు ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఆత్మాహుతి దాడితో మొగాడిషులో భారీ ఎత్తున కట్టుదిట్టం చేశారు. ప్రజలను అప్రమత్తం చేశారు. మొగాడిషులో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారంతో సైనికులు జల్లెడ పడుతున్నారు.