Home తాజా వార్తలు ఆర్ టిఎ దాడులు… 8 స్కూల్ బస్సులు సీజ్

ఆర్ టిఎ దాడులు… 8 స్కూల్ బస్సులు సీజ్

RTA

 

రంగారెడ్డి:  హైదరాబాద్ శివారు శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేశారు. పాఠశాల బస్సుల పై ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి.  నిబంధనలను పాతర వేస్తున్న స్కూల్ బస్సుల పై రవాణా శాఖ దృష్టి సాధించారు. రంగారెడ్డి జిల్లా డిటిసి ప్రవీణ్ రావు ఆదేశాల మేరకు శంషాబాద్ లో స్కూల్ బస్సులపై అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని బ్రిలియంట్, ఒయాసిస్, శారదా, రవీంద్ర భారతి స్కూల్స్ కు చెందిన 8 బస్సులను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. పలు బస్సుల పై కేసులు నమోదు చేశామన్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సులో పిల్లలను రవాణా చేయడం, డ్రైవర్లు యూనిఫాం వేసుకోక పోవడం, ఫిట్‌నెస్, పర్మిట్లు లేకుండా నడిపిన బస్సులను సీజ్ చేసి సీజింగ్ యార్డ్ కు తరలించారు. నిరంతరం ఈ దాడులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. క్రమం తప్పకుండా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని స్కూల్ బస్సుల యాజమానులు, స్కూల్ యజమన్యాలకు రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు.

 

8 School Buses Seized by RTA Attacks in Rangareddy