Thursday, April 25, 2024

రాత్రంతా కొనసాగిన ఎంపిల ధర్నా

- Advertisement -
- Advertisement -

 దిండ్లు, దుప్పట్లు, మసిటో కాయిల్స్ వెంట తెచ్చుకున్న సభ్యులు
 సంఘీభావం తెలిపిన పలువురు ఎంపిలు

న్యూఢిల్లీ: సోమవారం సస్పెండయిన ఎనిమిది మంది ఎంపిలు పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ధర్నా రాత్రంతా కొనసాగింది. వారి ధర్నాకు పలువురు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న తమ సహచరులకు మద్దతు తెలియ.ఏయడం కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, జెడి(ఎస్) అధినేత దేవెగౌడ, సమాజ్‌వాది పార్టీ ఎంపి జయాబచ్చన్, కాంగ్రెస్ ఎంపి అహ్మద్ పటేల్, ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో ఎంపీలు వారు ధర్నా చేస్తున్న చేటుకు వచ్చారు. కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్ దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన చేస్తున్న ఎంపిలతో పాటుగా కూర్చున్నారు. ధర్నా చేసిన సమయంలో తాము దేశభక్తిగీతాలు పాడామని, రైతులకు మద్దతుగా చుట్టూ ప్లకార్డులు వేలాడుతుండగా వారికి మద్దతుగా నినాదాలు చేశామని సస్పెండైన ఎంపిలలో ఒకరు పిటిఐకి చెప్పారు.‘ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు శాంతియుతంగా రాత్రంతా ఇలా ధర్నా చేయడం ఇదే మొదటి సారి’ అని ధర్నా చేసిన టిఎంసి ఎంపి డోలా సింగ్ చెప్పారు. ఓటింగ్‌ను కోరడానికి ఎంపిలకున్న హక్కును బహిరంగంగా తిరస్కరించడం కూడా ఇదే మొదటి పారని ఆమె అన్నారు. ఆందోళన చేస్తున్న ఇద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు చెందిన రిపు బోరెన్, సిపిఎంకు చెందిన ఎలామారమ్ కరీమ్ ఇద్దరూ 65 ఏళ్ల పైబడిన వారే కాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారు కావడంతో వారి ఆరోగ్యం విషయంలో ఎంపీలు కాస్త ఆందోళనకు గురయ్యారు.

అయితే తమ శరీరంలో తగినంత నీరు ఉండేలా తామంతా జాగ్రత్తలు తీసుకున్నట్లు టిఎంసి ఎంపి మెరిక్ ఒ బ్రియాన్ చెప్పారు. వారి శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోకుండా చూడడానికి ఎంపిల ఇళ్లనుంచి ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌మెంట్లు కూడా వచ్చేవని మరో ఎంపి చెప్పారు. అత్యవసరాల కోసం ఒక అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. సాధారణంగా సభ జరుగుతున్నప్పుడు రాజ్యసభసభ్యులులోక్‌సభ టాయిలెట్లనుఉపయోగించుకునే వారని, అయితే ఇప్పుడు తాము రిసిప్షన్ వద్ద ఉన్న టాయిలెట్లను ఉపయోగించుకోవలసి వస్తోందని మరో ఎంపి చెప్పారు. ధర్నాకు దిగిన ఎంపిలు తమ వెంట దిండ్లు, దుప్పట్లు లాంటివి తెచ్చుకోవడమే కాకుండా దోమలు కుట్టకుండా ఉండడానికి మస్కిటో కాయిల్స్ లాంటివి కూడా తెచ్చుకున్నారు. ఇది నిరవధిక నిరసన అని ప్రభుత్వం గ్రహించేలా చేయడానికే తాము ఇలా చేశామని ఒ బ్రియాన్ చెప్పారు. అవసరమైన బలం లేకున్నా బిల్లులను అమోదింప జేసుకోవడంపై ప్రభుత్వం తగిన హేతుబద్ధమైన వివరణ ఇచ్చేంత వరకు తాము ఈ ఆందోళనను కొనసాగిస్తామని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ చెప్పారు. కాగా పార్లమెంటు అవరణలో రాత్రంతా నిరసనలు జరగడం ఇదే మొదటిసారని పాతతరం నేతలు అంటున్నారు. అయితే రాష్ట్రాల అసెంబ్లీల్లో మాత్రం ఇలాంటి ధర్నాలు కొన్ని జరిగాయి.

8 Suspended MP’s dharna through all night

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News