Home తాజా వార్తలు నాగార్జునసాగర్ లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

నాగార్జునసాగర్ లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

Telangana Genco

 

హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిర్ధేశిత సామార్థ్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు తెలంగాణ జెన్కో  తెలపింది. శ్రీశైలంలో 150 టిఎంసిల నీరు రావడంతో పాటు కృష్ణా నది ప్రవాహ ఉధృతి కూడా 3 లక్షల క్యూసెక్కులు దాటడంతో విద్యుత్ ఉత్పత్తి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్ల ద్వారా శ్రీశైలంలో 900 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉందని జెన్కో పేర్కొంది.  రాబోయే కొద్ది రోజుల పాటు ఇదే ప్రవాహ ఉధృత ఉండే అవకాశం ఉండడంతో అత్యధిక విద్యత్తు ఉత్పత్తి చేయడానికి జెన్కో సిద్ధమైంది. కృష్ణా నదికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పవర్ స్టేషన్టలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్కో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జూరాల, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన జెన్కో… నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యవస్థలను సిద్ధం చేసింది.

నాగార్జునసాగర్ లోకి ప్రవేశిస్తున్న శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న నాగార్జునసాగర్ లో 134 టిఎంసిల నీరు చేరింది. శ్రీశైలం రిజర్వాయర్ రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని, నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతుందని ఆ సమయంలో నాగార్జునసాగర్ లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెంగాణ జెన్కో నిర్ణయించింది. నాగార్జునసాగర్ నుంచి కూడా నీరు విడుదలయితే పులిచింతలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్తత్పి చేయాలని, జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఒకేసారి పూర్తి సామర్థ్యం మేరకు జల విద్యుత్ ఉత్పత్తి ఇటీవలి కాలంలో అసాధ్యామని, గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గుతూ వస్తుండడమే కారణామన్నారు. ఈసారి కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేయడానికి జెన్కో సన్నద్ధం.

815 MW power generation from Nagarjuna Sagar