Saturday, April 20, 2024

మరో 894 మందికి వైరస్…

- Advertisement -
- Advertisement -

894 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 894 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 9, భద్రాద్రి 54, జగిత్యాల 32, జనగాం 17, భూపాలపల్లి 8, గద్వాల 8, కామారెడ్డి 10, కరీంనగర్ 36,ఖమ్మం 39, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 9, మహబూబాబాద్ 10, మంచిర్యాల 24, మెదక్ 11 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 84, ములుగు 16, నాగర్‌కర్నూల్ 12, నల్గొండ 48, నారాయణపేట్ 8, నిర్మల్ 8, నిజామాబాద్ 14, పెద్దపల్లి 28, సిరిసిల్లా 9, రంగారెడ్డి 70, సంగారెడ్డి 32, సిద్ధిపేట్ 21, సూర్యాపేట్ 22, వికారాబాద్ 7, వనపర్తి 5, వరంగల్ రూరల్ 18, వరంగల్ అర్బన్ లో 41, యాదాద్రిలో మరో 25 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,61,728కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,47,790 కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

50 లక్షల 50 వేలు దాటిన కరోనా టెస్టులు….

రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల 50 వేల 612 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి పది లక్షల మందిలో ఏకంగా లక్షా 35 వేల 696 మందికి కరోనా టెస్టులు చేసినట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. రాబోయే రోజుల్లో ప్రతి రోజూ లక్ష మందికి టెస్టులు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రతి రోజూ చేసే టెస్టుల్లో 44 శాతం మంది ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరో 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేస్తున్నట్లు అధికారులు హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నారు.

2270 మందికి హాస్పిటల్‌లో చికిత్స….

కోవిడ్ పాజిటివ్ తేలిన వ్యక్తుల్లో ఇప్పటి వరకు కేవలం 2270 మంది మాత్రమే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,61,728 మందికి పాజిటివ్ తేలగా వీరిలో ఏకంగా 2,47,790 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతానికి 12,515 యాక్టివ్ కేసులుండగా, వీరిలో 10,245 మంది ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News