Home తాజా వార్తలు ముగిసిన బతుకమ్మ వేడుకలు

ముగిసిన బతుకమ్మ వేడుకలు

9 days of bathukamma festival celebrations ended

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొమ్మిదో రోజు కోలాహలం సందడి సందడిగా కొనసాగింది. తీరొక్క పూలతో మహిళలంతా వీధివీధినా బతుకమ్మను పేర్చి ఆడి,పాడారు. మహాలయ అమావాస్య నుంచి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, తొమ్మిది రోజులు, నైవేద్యాలు, తొమ్మిది రూపాల్లో అమ్మవారిని మహిళలు పూజించగా, చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగిశాయి పోయిరా బతుకమ్మ ఉయ్యాలో….మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ఆ గౌరమ్మ తల్లికి ఘనంగా వీడ్కోలు పలికారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, సత్తుపిండి, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి గౌరమ్మకు నైవేద్యాన్ని సమర్పించారు. గురువారం చివరి రోజైన సద్దుల బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడంతో ఈ వేడుకలు ముగిశాయి.

9 days of bathukamma festival celebrations ended