Friday, April 19, 2024

గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

Dead Bodies

వరంగల్:  వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామశివారులో ఓ కోల్డ్‌స్టోరేజీ ఎదురుగా ఉన్న బావిలో నిన్న బావిలో 4 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించి బయటకు తీశారు. దీంతో గొర్రెకుంట బావిలో తొమ్మిది మంది మృతి మిస్టరీగా మారింది. ఒకే బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడడం స్థానికంగా అందరిని భయందోళనకు గురిచేస్తోంది. అసలు వీరు ఎలా చనిపోయారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మృతులంతా బెంగాల్ నుంచి వలసవచ్చిన కార్మికులే.

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం మక్సూద్ కుటుంబం బెంగాల్ నుంచి వలస వచ్చారు. ఈ ఘటనలో అనుమానితుడైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషాద ఘటనపై త్వరలో మిస్టరీ విడనుందని పోలీసులు చెబుతున్నారు. మక్సూద్ ఇద్దరు కొడుకులు, బిహారీకు చెందిన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులను మక్సూద్, నిషా, బుస్ర, షాబాద్ ఆలం, శ్రీరామ్ బిహారీ, షకీల్ గా గుర్తించారు. ఇవాన్నీ సామూహిక హత్యలా… ఆత్మహత్యలా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9 Dead Bodies Identified in Well at Gorrekunta in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News